22 August, 2026 | 7:42 PM

పచ్చదనమే లక్ష్యంగా వన మహోత్సవం

22-08-2026 06:45 PM

కౌటాల,(విజయక్రాంతి): మండలం కన్నెపల్లి గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బండు ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మోర్లె పార్వతి మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.

పర్యావరణ పరిరక్షణకు గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోర్లె సమత, వార్డు సభ్యుడు తిరుమలేష్, పంచాయతీ కార్యదర్శి తొడుపునూరి సాయికృష్ణ, సీసీ శంకర్, టీఏ మంగళ్ సింగ్, ఎఫ్ఏ వెంకటేష్, వివోఏ దేవాజి, కరోబార్ నాగేష్, మేట్ రాజశేఖర్, భూ యజమాని లెండుగూరె బాపూరావుతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.