గుండెపోటుతో సర్పంచి మృతి
22-08-2026 06:30 PM
పాడే మోసి నివాళులు అర్పించిన మంత్రి సీతక్క
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడా మండలం ఓటాయి గ్రామ సర్పంచ్ గట్టి రాములు గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క హుటాహుటిన ఓటానికి చేరుకొని సర్పంచ్ మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గట్టి రాములు పార్థివ దేహం పై పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. రాములు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నిస్వార్థ సేవకు నిదర్శనమైన రాములు మరణం తీరని లోటుగా మంత్రి పేర్కొన్నారు. అనంతరం రాములు అంత్యక్రియల్లో పాల్గొని పాడేమోసి శ్రద్ధాంజలి ఘటించారు.






