3 July, 2026 | 9:28 PM

Breaking News

రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •  

అన్ని విధాలా ఆదుకుంటాం

18-11-2025 01:01 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్(విజయక్రాంతి): సౌదీలో జరిగిన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. ఈ విషయమై విదేశాంగ శాఖ అధికారులు, హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి, పలు సూచనలు చేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించి బాధితులకు సహాయం అందించేందుకు కేంద్రం యుద్ద ప్రాతిపదికన రంగంలోకి దిగిందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధితులకు, మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయక చర్యలను సౌదీలోని భారత దౌత్యవేత్తలు ప్రారంభించారని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇప్పటికే సౌదీ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని చెప్పారు.

బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులో యాత్రికుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.