3 July, 2026 | 10:24 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

హైదరాబాద్ యాత్రికుల మృతి బాధాకరం

18-11-2025 12:59 AM
  1. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలి

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి) : సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. సోమవారం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాదీలే ఉన్నారనే సమాచారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విదేశీ మంత్రిత్వశాఖతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. ఊహించని విధంగా జరిగిన ప్రమాదంలో మరణించిన వారి వివరాలను గుర్తించి వారి కుటుంబాలకు అన్ని రకాలుగా సర్కారు అండగా నిలవాలని కోరారు.