3 July, 2026 | 8:34 PM

Breaking News

కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •   గీతంలో పికిల్ బాల్ కోర్టులు ప్రారంభం   •   రాజు గోండుల కోటను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్ రాజర్షిషా   •   ప్రవీణ్ కుమార్‌పై మంత్రి వ్యాఖ్యలు సరికాదు   •  

ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

18-11-2025 01:02 AM

 -19, 20 తేదీల్లో నిర్వహణ

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపులపై అనర్హత విచారణ ఎదుర్కొంటున్న పిటిషన్లపై విచారణలో వాదనలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 19న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, సంజయ్‌పై దాఖలైన పిటిషన్లకు సంబంధించి వాదనలు, 20న ఎమ్మెల్యే పో చారం శ్రీనివాస్‌రెడ్డి, అరెకెపూడి గాంధీలపై దాఖలైన పిటిషన్లపై విచారించనున్నారు. ఈ రెండు రోజులు ఇరు వర్గాల తరపు న్యాయవాదుల వాదనలను స్పీకర్ విననున్నారు.