5 May, 2026 | 1:26 AM

చనిపోయిన పోలీసు కుటుంబాలను ఆదుకుంటాం

05-05-2026 12:01 AM

నిర్మల్ మే 4 (విజయ క్రాంతి)నిర్మల్ జిల్లాలోని బాసర పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వెంకట రమణ అనే హోం గార్డు కొన్ని రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృ తి చెందారు.

ఈ సందర్భంగా యాక్సిడెంటల్ బెనిఫిట్ స్కీమ్ కింద మృతుడి కుటుంబానికి రూ.30 లక్షల చెక్కును జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్, తన చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లా డుతూ, విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది సంక్షేమం పట్ల ప్రభుత్వం మరియు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. మృతుడి కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం కొంతమేరకు ఆదరణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.