12 March, 2026 | 10:21 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

సమర్థవంతంగా సేవలందిస్తాం

12-03-2026 12:18 AM

కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన టీజీవో జిల్లా అధ్యక్షులు విజయకుమార్, టీజీవో నేతలు 

మహబూబ్ నగర్ టౌన్ 11 : ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి పూర్తిస్థాయిలో సమర్థవంతంగా సేవలు అందిస్తామని టీజీవో జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. మహ బూబ్నగర్ జిల్లా కు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఐఏఎస్ గారిని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మహబూబ్నగర్ జిల్లా శాఖ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కని అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ తో మాట్లాడుతూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమయపాలన సంబంధం లేకుం డా ఎల్లప్పుడు ప్రజాసేవకు అంకితం అవుతూ పనిచేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కె. వరప్రసాద్, ట్రెజరర్ కె. టైటస్ పాల్, ఉపాధ్యక్షులు ఎల్. తానాజీ, జా యింట్ సెక్రటరీ కె.ఎస్. నరేష్ కుమార్, కార్యాలయ కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి, సెంట్రల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎం. రామకృష్ణ గౌడ్,

సెంట్రల్ అసోసియేషన్ గేమ్స్ సెక్రటరీ గంప శ్రీని వాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్ తో పాటు కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ ను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.