2 September, 2026 | 10:28 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

కరూర్ తొక్కిసలాట కుట్రే!

11-07-2026 | 12:03am

పోలీసులను నమ్మి మోసపోయాను

జనసందోహం గురించి తెలిసినా హెచ్చరించ లేదు

నన్నే బాధ్యుడిగా నిలబెట్టాలని చూశారు

బహిరంగ సభలో తమిళనాడు సీఎం విజయ్

కరూర్ బాధిత కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ

చెన్నై, జూలై 9: ‘కరూర్ తొక్కిసలాట ఘటన నా జీవితంలో మాయని మచ్చ. పోలీసులను నమ్మి మోసపోయా. సభలో భారీ జన సందోహం గురించి తెలిసినా పోలీసులు ముందుగా ఎందుకు హెచ్చరించలేదు.దీని వెనుక పెద్ద కుట్రే ఉంది. పోలీ సులు ఆ రోజు డ్రామానే ఆడారు.

చివరికి నన్నే బాధ్యుడిగా నిలబెట్టాలని చూశారు’ అని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజ య్ సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి డీఎంకే ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యం వల్లే 41 మంది ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. సీఎం విజయ్ ఇచ్చిన హామీ మేరకు కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన 41 మంది కుటుంబాల్లో 31 మందికి శుక్రవారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం విజయ్ మాట్లాడారు.

కరూర్ ఘటనపై మానసిక వేదన అనుభవిస్తుంటే, కొందరు రాజకీయ లబ్ధికోసం తాను పారిపోయానని దిగజారి ప్రచారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, వారి ఆశీర్వాదంతోనే సీఎం అయ్యానని స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయాణంలో అత్యంత బాధాకరమైనది కరూర్ తొక్కిసలాట ఘటన అని, ఇంతటి విషాదం జరుగుతుందని  ఊహించలేదన్నారు.

మృతుల జ్ఞాపకా ర్థం త్వరలో స్మారక స్థూపం నిర్మించనున్నట్లు హామీ ఇచ్చారు. ప్రజాశీర్వాదం ఉన్న న్ని రోజులు తనను అధికారంలో నుంచి ఎవ్వరూ దించలేరంటే అన్నాడీఎంకే, డీఎంకేలపై పరోక్ష విమర్శలు చేశారు. గత ప్రభు త్వాల అవినీతిని ఎండగట్టారు. తన పాలనలో అవినీతికి తావుండదని,  చిత్తశుద్ధితో, పారదర్వకంగా ప్రజలకు సేవలందిస్తున్నామని సీఎం విజయ్ స్పష్టం చేశారు.  

సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట

సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఉద్యోగ పత్రాల పంపిణీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు నియామక ప్రక్రియను ముం దుకు తీసుకెళ్లవచ్చని న్యాయస్థానం పేర్కొంది. అయితే, ఈ నియామకాలు తాత్కాలికం మాత్రమేనని, భవిష్యత్తులో తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.

జస్టిస్ సీవీ కార్తికేయన్, జస్టిస్ ఆర్ శక్తివేల్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేసి ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలు, ఉద్యోగార్థుల అర్హతపై నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.