2 September, 2026 | 9:26 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ఇరాన్ తీరంపై మూడో విడత దాడులు

11-07-2026 | 12:04am

సిస్తాన్, బలూచిస్తాన్‌లోని చాబహార్‌లో పేలుళ్లు

బందర్ అబ్బాస్‌లోని రేవుపై వైమానిక దాడి

30 చేపల పడవలు, మౌలిక వసతులు ధ్వంసం

టెహ్రాన్, జూలై 10: ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ ఖననానికి సిద్ధమవుతున్న తరుణంలో, గురు వారం దక్షిణ ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై గురువారం సాయంత్రం నుంచి మూడోవిడత దాడులు జరిగాయి. సిస్తాన్, బలూచి స్తాన్‌లోని చాబహార్‌లో పేలుళ్లు సంభవించాయి.

బందర్ అబ్బాస్‌లోని ఓ రేవుపై వైమానిక దాడిలో 30 చేపల పడవలు, మౌలిక వసతులు ధ్వంసం అయ్యాయి. ఈ దాడులకు ఇరాన్ ఎవరినీ నేరుగా నిందించలేదు. కానీ ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న ప్రచారానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ ఒక చట్టసభ సభ్యుడు ఆ దేశాన్ని శుక్రవారం హెచ్చరించారు. ఈ దాడులపై గల్ఫ్ అరబ్ దేశాలు గానీ, ఇజ్రాయెల్ గానీ, సెంట్రల్ కమాండ్ గానీ స్పందించ లేదు.

హోర్ముజ్ జలసంధి నౌకల రాకపోకలకు తెరిచి, స్వేచ్ఛగా ఉండాలని గల్ఫ్‌దేశాలు, అమెరికా పట్టుబడుతున్న తరుణంలో ఈ దాడులు జరగడం గమనార్హం. ఇరాన్ తీరంపై మూడో విడత దాడులు జరిగాయి. ఒమన్ గల్ఫ్‌లోని ఆగ్నేయ ప్రావిన్స్ అయిన సిస్తాన్, బలూచిస్తాన్‌లోని చాబహార్ పరిసరాల్లో పేలుళ్లు వినిపించాయి. తీరానికి కొంచెం పైకి, దక్షిణ ఇరాన్‌లోని బుషెహర్‌లో కూడా వైమానిక దాడులు జరిగాయి. అక్కడ కూడా పేలుళ్లు సంభవించినట్లు సమాచారం.

కొనారాక్‌లోని నేవల్ జోన్‌లో శత్రుదేశ ఫైటర్ జెట్లు రెండు విడుతల్లో దాడులు చేసినట్లు ఇరాన్ అధికారి మహ్మద్ యూనిస్ హక్కానీ పేర్కొన్నారు. ఈ పేలుళ్లు ఎలా జరిగాయో స్పష్టంగా తెలియదు. ఇది అమెరికా నుంచి కాదని, కువైట్ నుంచి జరిగిందని, గల్ఫ్ నుంచి జరిగి ఉండవచ్చని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. మరో పక్క అరబ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ సభ్యు డు ఇస్మాయిల్ కౌసరి ‘యునైటెడ్ స్టేట్స్‌కు సహకరించినందుకు యూఏఈ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ మీడియా శుక్రవారం పేర్కొంది. ఇటీవల జరిగిన అమెరికా దాడుల్లో ‘తెర వెనుక’ ఎమిరేట్స్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. బందర్ అబ్బాస్‌లోని ఒక రేవుపై అమెరికా జరిపిన దాడిలో 30 చేపల పడవలు ధ్వంసమయ్యా యి అని ముంబైలోని ఇరాన్ రాయబార కార్యాలయం శుక్రవారం పేర్కొంది. ఒక్కో చేపల పడవ విలువ సుమారు 11వేల డాల ర్లు ఉంటుందని తెలిపింది. ఈ దాడుల్లో రే వు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని చెప్పింది.