ప్రతి ఉద్యమకారుడిని గుర్తిస్తాం..
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే. కేశవరావు
ముషీరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): ఉద్యమ కారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే. కేశవరావు ను కలిసి తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర కమిటీ నాయకులు బుధ వారం చర్చించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ ప్రతి ఉద్యమ కారుడు స్వచ్ఛందంగా తమ వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలని ఈ నెల 26 తేదీన అధికారిగా వ్బుసైట్ ను ప్రారంభం చేస్తున్నామని వెల్లడించారు.
ఎవరి సిఫారసు లేఖ అవసరం లేకుండా రాజకీయ ప్రమేయం లేకుండా ప్రతి ఉద్యమ కారులను గుర్తిస్తామని తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం చైర్మన్ డా. చీమ శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాకాల రామచందర్, వైస్ చైర్మన్ గుండు దయానంద్, ఉపాధ్యక్షులు ఆర్ కే. భూపాల్, వి. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.






