ఖానామెట్‌లో రూ.1,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
25-06-2026 12:09 AM
శేరిలింగంపల్లి, జూన్ 24 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నంబర్ 42లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైద్రా అధికారులు విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు. మెట్రో చా ర్మినార్ -హైటెక్ సిటీ మార్గంలో ఉన్న ఈ అతి విలువైన భూమి దశాబ్దాలుగా ఆక్రమణకు గురైంది.
అక్రమంగా నిర్మించిన రెండు తా త్కాలిక షెడ్లు, ఒక గది రేకుల ప్రహరీని అధికారులు ధ్వంసం చేసి భూమి చుట్టూ బలమై న ఫెన్సింగ్ వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.1,000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.






