ప్రైవేట్ పాఠశాలల బస్సులను మా ఊరికి రానివ్వం
మన పిల్లలను మన బడిలోనే చదివించుకుందాం
ప్రభుత్వ పాఠశాలలు కాపాడుకుందాం
గ్రామసభలో పాలకవర్గం తీర్మానం
ముస్తాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోనికి ప్రైవేట్ బస్సు రాకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందామనే ఆశ యం తో వారంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతూ క్రమ శిక్షణ కలిగి చదివేవారు.
ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరి స్తూ చదివించేవారు. ఎక్కములు, తెలుగు పద్యాలు నేర్చుకొని చూడకుండా చదివే వరకు ప్రతిరోజు చదివించేవారు. చదువు నేర్పే క్రమంలోనే విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు దండించేవారు. అలా చేయడం వల్లనే మాకు చదువు వచ్చిందని పూర్వ విద్యార్థులు తెలిపారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో ఆంగ్లం కీలకంగా మారిందని, క్రమ క్రమంగా తెలుగు మీడియం చదువులకు దురంగా ఇంగ్లీష్ మీడియం కలిగిన ప్రైవేట్ పాఠశాలల వైపు విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గు చూపడం ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలు చదువునుగా లికి వదిలేసి వ్యాపార కేంద్రాలుగా మారాయని, లక్షలు లక్షలు ఫీజులు కట్టాల్సిన పరి స్థితి ఏర్పడిందని,దీనివల్ల తల్లిదండ్రులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉందని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు.విలువలతో కూడిన విద్య అందిస్తారని వెల్లడించారు.పేద పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని వారికి అండగా మనమంతా ఉండి ప్రభుత్వ బడులను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు.ఉపాధ్యాయులు సరైన విదంగా పిల్లలకు చదువు చెప్పకపోతే వారిపై చర్యలు తీసుకునేలా మండల,జిల్లా విద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్దామని సూచించారు.
విద్య, వైద్యం ఉచితంగా రావాలని మనమే ఉపన్యాసాలు ఇస్తాం కానీ మళ్ళీ మనమే ప్రైవేటు సంస్థలకు అండగా నిలబడుతాం. ప్రభుత్వ పథ కాలు కావాలి.కానీ ప్రభుత్వ బడి మాత్రం వద్దు ఇదేనా మనకు కావలసింది. ఇప్పటికైనా మనమంతా ఏకమై ప్రభుత్వ పాఠ శాలలలో మన పిల్లలను చదివిద్దాం. ఆదర్శంగా ఉందాం. అని గ్రామస్తుల సహకారంతో గ్రామసభలో విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు పాలకవర్గం నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిపారు. కావున గ్రామస్తులు ఇలాంటి విషయాలకు సహకరించి పేద విద్యార్థులకు విద్యను అందే విధంగా చొరవ చూపి ప్రైవేట్ పాఠశాలలకు స్వస్తి పలికాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలల బస్సులను గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటామని బస్సులు గ్రామంలోకి పూర్తి స్థాయిలో రాకుండా నిరంతర మా ప్రయత్నం ఆగదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.






