11 June, 2026 | 1:26 AM

పెంచిన ధరలు తగ్గించేంతవరకు పోరాడుతాం

11-06-2026 12:23 AM

సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాధం 

జగిత్యాల, జూన్ 10 ( విజయక్రాంతి ) : సామాన్య ప్రజలపై పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించేంతవరకు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరాడుతామని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం హెచ్చరించారు.భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఒక్క నెలలోనే అనేకమార్లు పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్ ధరలు పెంచారని వాటిని వెంటనే తగ్గించాలని జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా ఆందోళన కార్యక్రమం సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టారు.

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం మాట్లాడుతూ భారతదేశంలో ఐదు జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే అమెరికా ఇరాన్ మధ్య జరిగిన యుద్ధ వాతావరణము ఆసరా చేసుకొని పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారని ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానమని పేర్కొన్నారు.పెట్రోల్, డీజిల్ పెరగటం వల్ల మార్కెట్లో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజలు కుటుంబ పోషణ కరువైపోయిందని వివరించారు.

దానికి తగ్గట్టుగా పేదవాడికి కూలి రేటు పెంచడం లేదని ఆందోళన చెందుతున్నారు ఇలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్ర లోని బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ దుశ్చర్యలకు పాల్పడడం బాధాకరమన్నారు.రానున్న రోజుల్లో ఇలాంటి నిర్ణయాలు సంఘటనలపై ప్రజాసంఘాలతో ప్రతిపక్ష నేతలతో చర్చలు జరపాలని లేని యెడల కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్షంగా పోరాడవలసి ఉంటుందని హెచ్చరించారు.

ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో సిపిఐ జిల్లా నేతలు ఇరుగురాల భూమేశ్వర్, సుతారి రాములు, ఎండి ముక్రం,మునుగూరి హనుమంతు, వెన్న మహేష్, కొక్కుల శాంత, ఎన్నం రాధా, ఎండి ఉస్మాన్,ప్రజానాట్యమండలి నాయకుడు లక్ష్మణ్, శ్రీ గాద దేవదాస్,కిరణ్, శ్రీనివాస్, పిట్టల నారాయణ, చిన్న వేణి దశరథం, సాంబార్ మహేష్,మల్లాపూర్ రాజన్న, తదితరులు పాల్గొన్నారు.