11 June, 2026 | 1:26 AM

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఆయిల్ చోరీ

11-06-2026 12:22 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జూన్ 10: ఓ రైతు తన వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి గుర్తు తెలియని వ్యక్తులు ఆయిల్ చోరీ చేశారు. బాధిత రైతు తెలిపిన వివరాలు ప్రకారం జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన సంద శ్రీరాములు గ్రామ శివారులోని దేవుని కోళ్ల ఫారం సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ లోని కూలింగ్ పైపుకు రంధ్రం చేసి అందులోని సుమారు 80 లీటర్ల ఆయిల్ ను చోరి చేశారు. ఇట్టి విషయమై రైతు స్థానిక లైన్మెన్ వెంకట్ రెడ్డికి తెలపగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.