11 June, 2026 | 1:19 PM

కైలాస్ టేకిడి ఆలయం వరకు రోడ్డు నిర్మాణం చేస్తాం: ఎమ్మెల్యే

11-06-2026 12:06 PM

15 కోట్ల రూపాయలతో కైలాస్ టేకిడి ఆలయం వరకు రోడ్డు నిర్మాణం చేస్తాం ఎమ్మెల్యే.. 

బోథ్,(విజయక్రాంతి):  సిసి రోడ్డు లేని గ్రామాలు ఉండకూడదని భవిష్యత్తులో నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో సిసి రోడ్ల నిర్మించి తీరుతామని అంతేగాక 14 కోట్ల రూపాయలతో మండలంలోని కైలాస్ టేకిడి ఆలయం వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని కంటేగాం గ్రామంలో 15 లక్షల రూపాయలతో మంజూరు అయిన సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక గ్రామాల్లో సరైన రోడ్డు వసతి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

అయితే ప్రజల ఇబ్బందులను గుర్తించి సిసి రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఓరుగంటి స్వామి మాజీ జెడ్పిటిసి రాజనాల సంధ్యారాణి సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి సర్పంచులు సంజీవ్ రవీంద్ర అంబాజీ సంజీవ్ మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ బోత్ మండల యూత్ అధ్యక్షులు ప్రవీణ్ పట్టణ అధ్యక్షులు అల్లకొండ ప్రశాంత్ బోత్ వీడిసి అధ్యక్షులు కల్లకొండ పోతన్న టిఆర్ఎస్ మండల కార్యదర్శి ఎలుక రాజు దేవేందర్ శ్రీను సత్యనారాయణ లు ఉన్నారు