30 July, 2026 | 9:06 AM

ఉప్పొంగిన ఒర్రెలు 12 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

30-07-2026 08:28 AM

 బెజ్జూర్ జూలై 30 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని కృష్ణ పల్లి,సుస్మిర్ సమీపంలోని రెండు ఒర్రెలు ఉప్పొంగడంతో 12 గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు గిరిజన గ్రామాల ప్రజలకు మండల కేంద్రానికి సంబంధాలు తెగిపోతాయి.భారీగా వర్షాలు కురిస్తే ఈ రెండు గొర్రెలు భారీగా ప్రవహిస్తాయి. అటవీశాఖ అనుమతులు లేక ఒర్రెల పై వంతెనలు మంజూరు కాకపోవడంతో గిరిజన గ్రామాల ప్రజలు నానా తంటాలు పడుతూ గడుపుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో బాధపడేవారు ఆసుపత్రులకు వెళ్లాలంటే వెళ్లలేని దుస్థితిగా మారిందని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గిరిజన గ్రామాల ప్రజలు పడుతున్న తిప్పలను చూసైనా ప్రభుత్వం స్పందించి ఒర్రెల పై వంతెనలు మంజూరు చేసి ప్రజల తిప్పలను తీర్చాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.