అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
31-08-2026 11:34 PM
రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో స్థానిక వార్డు కౌన్సిలర్ గాదాసు మంజుల రవీందర్ తో కలిసి ఇందిరమ్మ ఇల్లును ఆయన ప్రారంభించారు. పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజలు భవిష్యత్తులోనూ అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యేను లబ్ధిదారులు ఘనంగా సన్మానించారు.






