హస్తినలో రంగుల రాజకీయం
- రేవంత్ రెడ్డి మార్క్
- మంత్రివర్గంలో ఎవరికి బెర్త్?..
- స్పీకర్‌కు మంత్రి పదవీ, రామ్మోహన్ రెడ్డికి చీఫ్ విప్ అంటూ ప్రచారం
- తెరపైకి కల్వకుర్తి సెంటిమెంట్ తీసుకొస్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి
రంగారెడ్డి, అగస్టు 31(విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ సర్కార్లో మంత్రివర్గ విస్తరణ మరియు మార్పుల ప్రచారం పీక్ స్టేజ్కు చేరింది. రాబోయే శాసనసభ సమావేశాలకు ముందే కేబినెట్ను కొలిక్కి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముమ్మర కసరత్తు పూ ర్తి చేస్తోంది. అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ కోసం ఆశావహులంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండ గా, ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి, పాలమూరు రాజకీయాల్లో తీవ్ర వేడి కనిపిస్తోంది.
ఢిల్లీ బాట పట్టిన పరిగి, ఇబ్రహీంపట్నం నేతలు.రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చీఫ్ విప్, పరిగి ఎమ్మెల్యే టి. రాంమోహన్ రెడ్డి తో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి లు ఇప్పటికే పలు దాపాలుగా హ స్తిన బాట పట్టి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి కేబినెట్ బెర్త్ కోసం తమ అభ్యర్థిత్వాన్ని గట్టిగా విని పించారు.
ఒకవేళ ఉ మ్మడి రంగారెడ్డి నేతలకు అవకాశం దక్కని పక్షంలో, అదే సామాజిక వర్గానికి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పే రును ప్రత్యామ్నాయంగా పరిశీలించే అవకా శం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కీలక మార్పులు..
స్పీకర్ మార్పుపై ప్రచారం వికారాబాద్ ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఆ పదవి నుంచి తప్పించి, ఆయనకు కేబినెట్లో మంత్రి పదవి అప్పగిస్తారనే వార్తలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. దీనివల్ల రంగారెడ్డి జిల్లా ప్రాతినిధ్యంతో పాటు ఎస్సీ సామాజిక వర్గ సమీకరణలు కూడా పూర్తవుతాయని పార్టీ భావిస్తోంది.
తెరపైకి కల్వకుర్తి సెంటిమెంట్..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కేబినెట్ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి విజయం సాధించిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తన పలుకుబడితో తీవ్రంగా యత్నిస్తున్నారు. 1989లో మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ తర్వాత కల్వకుర్తి నుంచి గెలిచిన ఎవరికీ మంత్రియోగం దక్కలేదనే సెంటిమెంట్ను ఆయన అధిష్ఠానం వద్ద ప్రస్తావిస్తున్నారు.
కల్వకుర్తి నియోజకవర్గం లో అభివృద్ధి పనుల పైన ప్రత్యేక పోకస్ పెట్టి... పార్టీ పటిష్టతలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు అవకాశం దక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనుక జరిగితే, పాలమూరు జిల్లా కోటా సమీకరణల దృష్ట్యా కసిరెడ్డికి మంత్రి పీఠం చిక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు అందరి లో ఆసక్తి రేపుతున్నాయి.
సామాజిక సమతుల్యత....
బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ప్రాంతీయ సమతుల్యతను పాటిస్తూ 2029 ఎన్నికల వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని అధిష్ఠానం ముగింపు ఇవ్వనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే తుది నివేదిక ఆధారంగా ఏఐసీసీ ఆమోదం తెలిపిన వెంటనే, నూతన మంత్రుల ముహూర్తం ఖరారై ప్రమాణ స్వీకారం జరగనుంది. చూడాలా మరి నూతన మంత్రివర్గ విస్తరణలో... అమర్త్య యోగం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎవరికి దక్కుతుందో అప్పటివరకు వేచి చూడక తప్పదు మరి.






