పంజాబ్ నేషన్ బ్యాంక్ శాఖ ప్రారంభం
01-09-2026 01:52 AM
హైదరాబాద్, ఆగస్టు 31(విజయక్రాం తి):హైదరాబాద్ సర్కిల్ కార్యాలయం పరిధిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ హయత్ నగర్ శాఖను, హైదరాబాద్ సర్కిల్ హెడ్ అరవింద్ కాల్రా సమక్షంలో జోనల్ హెడ్ (జనరల్ మేనేజర్) వందన పాండే సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు,వినియోగదారులు హాజరయ్యారు. వందన పాండే, అరవింద్ కాల్రా సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. హైదరాబాద్ సర్కిల్ కార్యాలయం పరిధిలో ఇది 78వ శాఖ.






