1 September, 2026 | 1:32 AM

మనబడి తెలుగుకు పరుగు రన్ 4 తెలుగు 2026

01-09-2026 01:15 AM

అమెరికాలో సిలికానాంధ్ర మనబడి వినూత్న కార్యక్రమం

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): అమెరికా సంయుక్త రాష్ట్రాల్తో సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని, వ్యావహారిక భాషోద్యమ పితామ హుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ప్రతిష్ఠా త్మక ‘తెలుగుకు పరుగు రన్4 తెలుగు 20 26’ కార్యక్రమం ఘనంగా జరిగింది.

వల్లభాపురపు బాలాజీ, అల్లం శ్రీదేవి నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికాలోని అరిజోనా, కాలిఫోర్నియా, కొలరా డో, జార్జియా, ఇల్లినాయిస్, మిషిగన్, మిన్నెసోటా, మిస్సోరీ, న్యూ జెర్సీ, ఒక్లాహోమా, టెన్నెస్సీ, టెక్సాస్, వర్జీనియా రాష్ట్రాలలోని సుమారు 25 ప్రాంతాల నుంచి మూడు వేల మందికి పైగా తెలుగు భాషాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశాన్ని సమాజానికి అందించాలనే లక్ష్యంతో మనబడి భాషా సైనికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు ‘తెలుగుకు పరుగు’లో ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మనబడి ‘తెలుగు కు పరుగు’ నిర్దేశకులు వల్లభాపురపు బాలా జీ మాట్లాడుతూ, మనబడి నిర్వహిస్తున్న తెలుగు భాషా తరగతుల గురించి వివరించారు.

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నమోదు వివరాలను తెలియజేస్తూ, తెలుగు భాషను భావితరాలకు అం దించడం ప్రతి తెలుగు కుటుంబం బాధ్యత అని గుర్తుచేశారు. అమెరికా, కెనడాతో పాటు వివిధ దేశాలలో మనబడి నిర్వహిస్తున్న తెలుగు తరగతులు, కార్యక్రమాల గు రించి కూడా వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన మనబడి అధ్యక్షులు, కులపతి చమర్తి రాజుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చమర్తి రాజు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించబడినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే తెలుగుకు పరుగులో పాల్గొ న్న ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు శుభాభినందనలు తెలిపారు.