నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
25-02-2026 12:00 AM
కుబీర్, ఫిబ్రవరి ౨౪ (విజయక్రాంతి): బైంసా డివిజన్లో తానూర్, భైంసా, కుబీర్ మండలాల్లో సోమవారం కురిసిన వర్షం వల్ల రైతుల పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయా మండలాల్లో దెబ్బతిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి వెంటనే నివేదిక ఇవ్వాలని కోరారు. రైతుల పంట నష్టం పై ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్టు తెలిపారు.




