29 July, 2026 | 1:16 AM

భూగర్భ జలాలను ఒడిసి పట్టుకోవాలి

29-07-2026 12:18 AM

జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ చంద్రశేఖర్

శంకర్‌పల్లి, జూలై 28 (విజయ క్రాంతి): వర్షపు నీటిని భూమిలోకి పంపి భూగర్భ జలాలను పెంచాలని జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం శంకర్ పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్ అసిస్టెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలు పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

జలసిరి కార్యక్రమం గురించి పలు రకాలుగా రివ్యూ చేసి సాంకేతిక సలహాలు ఇచ్చి, కార్మికులకు పని కల్పించడం లాంటి విషయాల వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వి. ప్రవీణ్ కుమార్, ఎంపీ ఓ గిరిరాజు, ఏ ఈ నందకిషోర్, ఏపీవో నాగభూషణం, ఈసీ జనార్దన్ రెడ్డి, టి ఏ పంచాయతీ కార్యదర్శులు, ఫీల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.