గర్వించదగ్గ వ్యక్తి జైపాల్‌రెడ్డి
- జేఎన్‌ఇసీలో ఘనంగా 7వ వర్థంతి
- సేవలను కొనియాడిన కళాశాలల చైర్మన్ కేఎస్ రవికుమార్
- విశ్రాంత అధ్యాపకులకు జైపాల్ రెడ్డి స్మారక పురస్కారాల ప్రదానం
మహబూబ్‌నగర్, జూలై 28 (విజయక్రాంతి): దేశం గర్వించదగ్గ మహానాయకుడు, అంగవైకల్యాన్ని అధిగమించి అత్యున్నతస్థాయికి ఎదిగిన వ్యక్తి మాజీ కేంద్రమంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ ఎస్. జైపాల్ రెడ్డి అని జయప్రకాశ్ నారాయణ్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కేఎస్. రవికుమార్ కొనియాడారు. మంగళవారం జైపాల్ రెడ్డి 7వ వర్థింతి సందర్భంగా కళాశాల ఆవరణలో ఆయన విగ్రహానికి, చిత్రపటానికి రవికుమార్, అధ్యాపక బృందం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి పురస్కారాలను విద్యారంగంలో విశేష కృషి చేసి, సేవలందించిన విశ్రాంత అధ్యాపకులు ఆలూరు గంగయ్య, రావూరి సూర్యనారాయణలకు పురస్కారాలను, రూ. 25 నగదు చెక్కును అందించి సన్మానించారు.
ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో జైపాల్ రెడ్డి కీలకపాత్ర పోషించారని, శాస్త్రీయ దృక్పథంతో రాష్ట్ర సాధనకు కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ సీ భాస్కర్, కార్యదర్శి వీ వెంకటరామరావు, ప్రిన్సిపల్ డాక్టర్ పీ కృష్ణమూర్తి, పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డాక్టర్ వీఇ చంద్రశేఖర్, వీఐపీ సంస్థ డాక్టర్ టీ నాగేందర్, సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు జగపతిరావు, నస్కంటి వీరన్న, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






