29 July, 2026 | 1:17 AM

నేడు మహబూబ్‌నగర్‌కు తీన్మార్ మల్లన్న

29-07-2026 12:18 AM

దేవరకద్రలో జెండా ఆవిష్కరణ, కారు ర్యాలీ, బహిరంగ సభ

మహబూబ్‌నగర్, జూలై 28 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బుధవాంర మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా దేవరకద్రలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ముందుగా మహబూబ్‌నగర్ పట్టణంలోనీ ఏనుగొండ 2వ వార్డులో పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు.

అక్కడి నుంచి పాలమూరు యూనివర్సిటీ వరకు భారీ కారు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం దేవరకద్రకు చేరుకుని బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టగా, కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.