9 May, 2026 | 9:16 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

ట్రాఫిక్ సమస్యపై అడిగి తెలుసుకుంటున్న దృశ్యం

09-05-2026 08:23 PM

ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరించాలి: ఎమ్మెల్యే బిఎల్ఆర్

మిర్యాలగూడ,(విజయక్రాంతి): సురక్షితమైన ప్రమాదలు లేని ప్రయాణం కొరకు పోలీసులు రూపొందించిన ట్రాఫిక్ నిబంధనలను పాటించడంలో పోలీసులకు సహకరించి ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వాములు కావాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి (బిఎల్ ఆర్ )అన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పట్టణ ప్రజల దశాబ్దాల ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చేపట్టే కార్యక్రమంలో భాగంగా శనివారం సాగర్ రోడ్డుపై నూతనంగా నిర్మి స్తున్న డివైడర్ల పనులను పోలీసులు, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో  పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి నిబంధనలు, పట్టణ మాస్టర్ ప్లాన్ లో భాగంగా చేపడుతున్న ఈ చర్యలు భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలను అధిగమించటపాటు రూపురేఖలను మారుస్తాయన్నారు. కొంతకాలంగా మారుతున్న ట్రాఫిక్ గమనగమనాలను కొత్త డివైడర్ల వల్ల కలుగుతున్న మార్పులను అధికారులతో  కలిసి సమీక్షించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేవలం జరిమానాలు విధించడమే కాకుండా ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని కొత్తగా మారుతున్న నిబంధనల వల్ల వాహనదాలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు.

నో పార్కింగ్ జోన్లలో వాహనాలు నిలపకుండా చూడాలని వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా వ్యాపారస్తులు నిర్దేశత పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలన్నారు. పట్టణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యమని అందులో భాగంగా ట్రాఫిక్ తగ్గించి ప్రమాద రహిత ప్రయాణాల అందించండమే తమ ద్యేయం అన్నారు. పట్టణములో ట్రాఫిక్ క్రమబద్దీపనకు అదనపు సిబ్బంది అవసరమని గుర్తించిన ఆయన వెంటనే జిల్లా పోలీస్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి ట్రాఫిక్ నియంత్రణకు అదనపు పోలీస్ సిబ్బందిని వెంటనే కేటాయించాలన్నారు. ఒకటి, రెండవ సి ఐ లు నాగభూషణరావు, జెట్టి సోమనర్సయ్య, ఎస్సై రాంబాబు, ట్రాఫిక్ ఎస్సై చల్లా శ్రీనివాస్ యాదవ్,పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.