9 May, 2026 | 9:17 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

బక్రీద్ పండుగ శాంతియుతంగా నిర్వహించాలి

09-05-2026 08:25 PM

– సీఐ రవీందర్ సూచనలు

కోనరావుపేట,(విజయక్రాంతి): రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని శుక్రవారం కోనరావుపేట పోలీస్ స్టేషన్‌లో మండలంలోని ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చందుర్తి సీఐ రవీందర్ పాల్గొని పండుగను శాంతియుత వాతావరణంలో, పరస్పర సహకారంతో నిర్వహించుకోవాలని సూచించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో బక్రీద్ వేడుకలు జరుపుకోవాలని తెలిపారు.ఈ సమావేశంలో పోలీసు సిబ్బంది, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.