17 July, 2026 | 11:16 AM

మరుగుదొడ్లు లేక విద్యార్థుల సతమతం.. ప్రమాదాలు జరిగితే బాధ్యులెవరు?

17-07-2026 11:16 AM

బోథ్, జూలై 17 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో సరియైన వసతులు లేక విద్యార్థులు సతమతమవుతున్నారు. ప్రస్తుతం వసతి గృహంలో 42 మంది ఇంటర్ చదివే విద్యార్థులు వసతి గృహంలో ఉంటున్నారు. అయితే ప్రభుత్వపరంగా హాస్టల్ భవనం నిర్మాణం కాకపోవడంతో పశు వైద్య శాల పైన ఉన్న హాల్ లో విద్యార్థులు ఉంటున్నారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో ఉదయం పూట బహిర్భూమికి వెళ్లే విద్యార్థులు బయటకు వెళ్లాల్సి వస్తున్నది. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. స్నానపు గదులు లేవు... విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా స్నానపు గదులు లేకపోవడంతో ఆరు బయటనే విద్యార్థులు స్థానాలు చేయాల్సి వస్తున్నది. చదువుకోవాలని ఉన్న వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందుల నడుమ కాలం వెళ్లదీస్తున్నారు.

ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరు.

అరకొర వసతుల మధ్య చదువుకుంటున్న విద్యార్థులు బహిర్భూమికి వెళ్లాలంటే సమీపంలోని మైదానాలకు లేదా పంట పొలాలలోకి వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. పాములు పాములు సంచరించే ప్రాంతాలలో బహిర్భూమికి వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికారులు విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సత్వరమే మరుగుదొడ్లు స్నానపు గదుల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది.