9 May, 2026 | 9:16 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

చిన్న వర్షానికే చిత్తడవుతున్న రోడ్లు

09-05-2026 08:20 PM

ఖైర్‌గాం గ్రామంలో ఇండ్ల ముందే నిలిచిన వర్షపు నీరు

డ్రైనేజీలు లేక గ్రామస్తుల ఇబ్బందులు

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో చిన్నపాటి వర్షాలకే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు చిత్తడిగా మారుతున్న పరిస్థితి నెలకొంది. రెబ్బెన మండలం ఖైర్‌గాం గ్రామంలో  స్వల్ప వర్షానికే రోడ్లపై నీరు నిలిచి చెరువులను తలపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. గ్రామంలోని పలుచోట్ల సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోతోంది. దీంతో కాలనీల్లో బురద, దుర్వాసన వ్యాపించడంతో పాటు దోమల పెరుగుదలకూ కారణమవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వృద్ధులు, చిన్నపిల్లలు ఇండ్ల నుంచి బయటకు రావడానికే ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇండ్ల ముందే నీరు నిలిచిపోతున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వర్షపు నీరు నిల్వ కాకుండా తక్షణమే డ్రైనేజీలు నిర్మించడంతో పాటు రోడ్లపై మొరం పోసి మరమ్మతులు చేపట్టాలని గ్రామ సర్పంచ్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.