సైబరాబాద్‌లో ఇన్‌స్పెక్టర్లు బదిలీ
కీలక పోలీస్ స్టేషన్లకు కొత్త ఎస్‌హెచ్‌వోలు
శేరిలింగంపల్లి,జూలై 18 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) పరిధిలో 55 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనాపరమైన కారణాలతో పలు పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్, ప్రత్యేక విభాగాల్లో మార్పులు చేపట్టారు.బదిలీల్లో భాగంగా కూకట్‌పల్లి ఎస్‌హెచ్‌వోగా డి. స్వామిగౌడ్, మధాపూర్ ఎస్‌హెచ్‌వోగా కె.వి. సుబ్బారావు, మియాపూర్ ఎస్‌హెచ్‌వోగా ఎన్. జయరాం, బాలానగర్ ఎస్‌హెచ్‌వోగా జి. ప్రశాంత్, చందానగర్ ఎస్‌హెచ్‌వోగా ఎ.ఆర్.ఇ. శ్రీధర్, రాయదుర్గం ఎస్‌హెచ్‌వోగా ఎన్. శ్రీనివాస్, గచ్చిబౌలి ఎస్‌హెచ్‌వోగా కె. సైదులు, ఆర్‌సీపురం ఎస్‌హెచ్‌వోగా ఎం. రాజేష్, పటాన్‌చెరు ఎస్‌హెచ్‌వోగా ఎం. రవీందర్‌ను నియమించారు.బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని, సంబంధిత డీసీపీలు రిలీవింగ్, జాయినింగ్ ప్రక్రియ పూర్తి చేసి వివరాలను కమిషనరేట్‌కు పంపించాలని ఆదేశించారు. శాఖలో సమర్థవంతమైన పరిపాలన,పనితీరు మెరుగుపర్చడమే ఈ బదిలీల లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు






