2 May, 2026 | 9:24 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఈవో నాగలక్ష్మి

06-03-2026 12:00 AM

బూర్గంపాడు, మార్చి5 (విజయక్రాంతి): విద్యార్థులు శ్రద్ధతో చదివి పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారిణి (డీఈవో) నాగలక్ష్మి అన్నారు. గురువారం మండల పరిధిలోని మోరంపల్లి బంజర ఉన్నత పాఠశాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని తెలిపారు.

ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ మంచి ఫలితాలు సాధించాలని ఆమె సూచించారు. అనంతరం పాఠశాల తరగతి గదులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.