21 May, 2026 | 1:24 AM

ప్రజలు సంతోషంగా ఉంటేనే మనకు సంతృప్తి

21-05-2026 12:10 AM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ మే 20 : ప్రజలు సు ఖ సంతోషాలతో ఉంటేనే మనకు సంతృప్తి ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం జి ల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎన్‌ఐసి కాన్ఫరెన్స్ హాల్ లో సంబంధిత అధికారులతో ని ర్వహించిన రోడ్ సేఫ్టీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే చర్చించారు. ఈ సమావేశంలో పో లీస్, ట్రాఫిక్, మున్సిపల్, రోడ్డు రవాణా శా ఖల అధికారులతో కలిసి పట్టణంలోని ప్ర స్తుత పరిస్థితులను సమీక్షించి, భవిష్యత్ కా ర్యాచరణపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇ చ్చారు.

పట్టణంలో నేరాల నియంత్రణ, ట్రా ఫిక్ పర్యవేక్షణ, ప్రజల భద్రత కోసం వచ్చే ఆరు నెలలలో మహబూబ్ నగర్ మొత్తం 750 వరకు సీసీ కెమెరాలతో కవర్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సీసీ కె మెరాలను ఎస్డీఎఫ్, ముడా, మున్సిపల్ కా ర్పొరేషన్ నిధులతో సమన్వయంగా ఏర్పా టు చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నపిల్లలు వాహనాలు నడపడం వల్ల ప్రమాదా లు పెరుగుతున్న నేపథ్యంలో, మైనర్లు వాహనాలు నడపకుండా కఠినంగా నియం త్రించాలని పోలీస్ శాఖకు ఆదేశించారు.

తల్లిదండ్రులపై కూడా బాధ్యతను నిర్ధారించే చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరం చుట్టూ ఉన్న ప్రధాన హైవేలు, బైపాస్ రోడ్ల లో స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసి వేగ నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో అతివేగం వల్ల జరిగే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచడానికి రోడ్ సేఫ్టీ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో ఎస్పి, నగర మేయ ర్, డిప్యూటీ మేయర్, ముడా చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తదితరులు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు.

నగరంలో ట్రాఫిక్ నియంత్రణ మెరుగుపడి, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గి ప్రజలకు మరింత భద్రత కలుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 25 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి జానకి, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిప్యూ టీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, పో లీస్, మున్సిపల్, ట్రాఫిక్,రోడ్డు రవాణ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.