18 August, 2026 | 3:16 AM

రైతుల పంటలను కాపాడాలి

18-08-2026 02:26 AM

ఇరిగేషన్ అధికారులకు మంత్రి తుమ్మల సూచన

ఖమ్మం, ఆగస్టు 17(విజయక్రాంతి):  ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా సకాలంలో సాగునీరు అందించేందు కు అన్ని రకాల చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్య వసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు* అధికారులను ఆదేశించారు.

సాగర్ ఆయక ట్టు పరిధిలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి లభ్యతను ఎప్పటిక ప్పుడు అంచనా వేస్తూ, అందుబాటులో ఉ న్న నీటిని సమర్థవంతంగా వినియోగించేలా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. సాగర్ ఆయకట్టు పరిధిలో ప్రస్తుతం సాగు చేసిన పంటలకు అవసరమైన నీటిని సకాలంలో అందించాల్సిన అవసరం ఉంద ని మంత్రి తుమ్మల తెలిపారు.

ఈ సమస్యను గత వారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  దృష్టికి, నీటిపారుదల శాఖ మంత్రి  ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సీతారామ ప్రాజెక్టు పంప్హౌస్లను ప్రారంభించి గోదావరి జలాలను సాగర్ ఆయకట్టు ప్రాంతాలకు అందించేందుకు వారు తక్షణమే కీలక ఆదేశాలు జారీ చేసినందుకు మంత్రి తుమ్మల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

వారి ఆదే శం సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసే ప్రక్రియను చేపట్టినట్లు మంత్రి తెలి పారు. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీ న అశ్వాపురం మండలం బిజ్జి కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు మోటార్లను ప్రారంభిం చి గోదావరి జలాలను రాజీవ్ లింక్ కెనాల్ కు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా సాగర్ ఆయకట్టు కింద ఉన్న ప్రధాన చెరువులకు నీరు చేరుతున్నాయని మంత్రి తెలిపారు.

సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు సాగు చేసిన పంటలకు అవసరమైన నీటిని సక్రమంగా, సకాలంలో అందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల ని మంత్రి తుమ్మల ఆదేశించారు. ప్రధాన కాలువలు, ఉపకాలువలు, కెనాల్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎక్కడైనా గండ్లు, లీకేజీలు లేదా ఇతర సాంకేతిక సమస్యలు త లెత్తితే వెంటనే మరమ్మతులు చేపట్టి నీరు వృథాగా పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నీటి ప్రవాహంలో ఎలాంటి అంతరాయం లేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని అధికారులకు స్పష్టం చేశా రు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి వస్తున్న జలాల ను అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. రైతులకు అవసరమైన మేరకు నీరు అందే లా అధికారులు ప్రణాళికాబద్ధంగా నీటి వి డుదలను చేపట్టాలని, ఒక ప్రాంతానికి అధికంగా నీరు వెళ్లి మరో ప్రాంతంలోని రైతుల కు నీటి కొరత ఏర్పడకుండా సమన్వయం తో వ్యవహరించాలని సూచించారు. ఆయకట్టు చివరి భూముల వరకు నీరు చేరేలా ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.