21 May, 2026 | 1:24 AM

1.120 కేజీల గంజాయి పట్టివేత

21-05-2026 12:11 AM

సికింద్రాబాద్, మే 20 (విజయక్రాంతి): సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మోండా మార్కెట్ సమీపంలో ఎస్‌ఎస్‌బి గోల్‌ప్లాజా వద్ద గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో డీటీఎఫ్‌టీఎం సీఐ సౌజన్య సిబ్బంది కలిసి రాజేష్ కుమార్ తివారి అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 1.120 కేజీల గంజాయి, టూవీలర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బీహార్‌కు చెందిన తివారిని సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించామని సీఐ తెలిపారు.