21 May, 2026 | 1:24 AM

లంచం తీసుకున్న లేడీ ఎస్‌ఐ అరెస్ట్

21-05-2026 12:09 AM

సికింద్రాబాద్, మే 20 (విజయక్రాంతి): లంచం తీసుకుంటూ మహిళా ఎస్‌ఐ పట్టుబడింది. సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పీఎస్‌లో అవినీతి అధికారిణిని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ అరెస్ట్ చేశారు. అభిషేక్ అనే యువకుడికి తల్లిదండ్రులకు మధ్య వివాదాలు తలెత్తాయి. యువకుడు తండ్రిపై దాడి చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ప్రతీ వారం పోలీస్ స్టేషన్‌లో సంతకం చేయాలని ఆదేశించారు.

స్టేషన్‌కు వెళుతున్న యువకుడిని రోజంతా కూర్చోబెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎస్‌ఐ లంచం అడిగారని యువకుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లి పీఎస్ ఎస్‌ఐ కిరణ్ నందిత, రైటర్ విజయ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలలో పోలీస్ స్టేషన్లలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే, లంచం అడిగినట్లయితే 1067 నెంబర్‌కు సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ జీ శ్రీధర్ తెలిపారు.