27 May, 2026 | 5:48 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

జొన్న పంటను తరలించేందుకు చర్యలు చేపడుతున్నాం

27-05-2026 03:20 PM

బోథ్,(విజయక్రాంతి): తమ మార్కెట్ కమిటీ పరిధిలో కొనుగోలు చేసిన జొన్న పంటను తరలించేందుకు తగు ఏర్పాటు చేస్తున్నామని మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో ఉన్న జొన్న పంటను నిలువ ఉంచేందుకు స్థానికంగా స్థలం లేకపోవడంతో మండలంలోని పోచర గ్రామంలో ఉన్న గోదామును పరిశీలించడం జరిగిందన్నారు. అందులో 35 వేల క్వింటాళ్ల వరకు నిలువ ఉంచేందుకు స్థలం ఉందని అయితే స్థానికంగా ఉన్న లారీ యజమానులతో మాట్లాడి నిల్వ ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని రెండు మూడు రోజుల్లో తూకం వేసిన జొన్న పంటను తరలిస్తామన్నారు. ఈ విషయమై జిల్లా అధికారులతో చర్చించామని తెలిపారు.