గాలి బీభత్సం.... రెండు ఆటోలు ధ్వంసం
- ఉరుములతో కూడిన భారీ వర్షం.
- నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు.
- ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు.
సుల్తానాబాద్ మే 27 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి గాలి బీభత్సం తో ప్రజలు తీవ్ర ఆందోళన గురయ్యారు, నీరుకుల్లా పాల డైరీ వద్ద చెట్టు విరిగి పడిపోవడంతో రెండు ఆటోలు ధ్వంసం అయ్యాయి, భారీ గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు విరిగిపోయి కింద పడ్డాయి, పలుచోట్ల ఇళ్లపై రేకులు పడిపోవడంతో పాటు గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి, విద్యుత్ సరఫరా లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మామిడి కాయలు నేలరాలాయి, అలాగే నీరుకుల్లా గ్రామంలో టెంట్ హౌస్ లో పైన ఉన్నటువంటి రేకులు విరిగి కింద పడడంతో తీవ్ర నష్టం వాటిల్లింది, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు, అలాగే పలు గ్రామాల్లోనూ భారీ గాలులకు, వర్షానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో రాత్రంతా జాగారం ఉండవలసి వచ్చింది , ఘటన సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గాలి బీభత్సం తో ప్రజలు భయాందోళనకుగురయ్యారు...






