16 May, 2026 | 1:47 AM

నీటి వృథాను అరికట్టాలి

16-05-2026 12:40 AM
  1. భూగర్భజలాల సంరక్షణకు చర్యలు
  2. తాగునీటి భద్రతపై ప్రత్యేక దృష్టి
  3. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి) : భూగర్భ జలాల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు తాగునీటి భద్రత కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫ్లోరైడ్, నైట్రేట్ వంటి సమస్యాత్మక అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ అధికారులతో శుక్రవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఈ. శ్రీధర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్  డైరెక్టర్ లక్ష్మణ్, డిప్యూటీ డైరెక్టర్ పీ జ్యోతికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూగర్భ జలాల సంరక్షణ అన్నది అత్యంత ప్రాధాన్యతాంశమని, ఈ విషయంలో రైతులకు ప్రత్యెక అవగాహన కలిగించెం దుకు అధికారులు చొరవ చూపాలని సూచించారు.

అదే  సమయంలో నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడంతో పాటు వృథాగా పోయే నీటిని నియత్రించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. 2024 తో పోల్చి చూసినపుడు 2025లో జలాల వినియోగం 45.93 శాతం నుండి 46.86 శాతానికి పెరిగిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. భూగర్భ జలాల సంరక్షణ అనేది ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేందుకుగాను ఇంకుడుగుంతల నిర్మాణాన్ని ఇబ్బడిముబ్బడిగా ప్రోత్సాహించాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాల పరిమాణాలని నిరంతరం గుర్తించేందుకు వీలుగా 1,771 ఫైజోమీటర్లను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.  పరిశ్రమలు, మైనింగ్ యూనిట్లు, అపార్టుమెంట్లు, ప్యాకే జ్డ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్లకు భూగర్భ జలాల వినియోగానికి అనుమతులు ఇవ్వడం ద్వారా వినియోగ చార్జీల రూపంలో 25.80 కోట్లు గడించినట్లు ఆయన తెలిపారు.

జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు అమలులో ఉత్తమ పనితీరు కనబర్చిన శాఖల్లో తెలంగాణ గ్రౌండ్ వాటర్ విభాగం ఒకటిగా గుర్తిం పు పొందడం అభినందనీయమని, ఇకపై భూగర్భ జలాల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కృత్రిమ మేధస్సుతో మరిన్ని సత్ఫాలితాలు సాధించాలని, మంత్రి అధికారులను ఆదేశించారు.

అధిక వినియోగ ప్రాంతాల్లో భూగర్భ జలాల వినియోగంపై నియంత్రణలు కఠినతరం చేయడంతోపాటు, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను మెరుగుపరచాలని, భూగర్భ జలాల వినియో గంపై శాఖల మధ్య సమన్వయంతో నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి భూగర్భ జలాల కమిటీల సమావేశాలను జిల్లా కలెక్టర్లు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు.  

2025 సంవత్సరంలో రాష్ట్రంలో భూగర్భ జలాల రీచార్జ్ గణనీయంగా పెరిగిందని సమీక్షలో అధికారులు వెల్లడించారు. 2024లో 18.44 లక్షల హెక్టారు మీటర్లుగా ఉన్న వార్షిక రీచార్జ్ 2025లో 19.61 లక్షల హెక్టారు మీటర్లకు పెరిగి సుమారు 1.17 లక్షల హెక్టారు మీటర్ల వృద్ధి నమోదైంది. అయితే అదే సమయంలో భూగర్భ జలాల వినియోగం కూడా 8.45 లక్షల హెక్టారు మీటర్ల నుంచి 9.18 లక్షల హెక్టారు మీటర్లకు పెరిగినట్లు అధికారులు వివరించారు.

తాజా భూగర్భ జలాల అంచనాల్లో అధిక వినియోగ ప్రాంతాలుగా గుర్తించిన గ్రామాల వివరాలను జిల్లా యంత్రాంగానికి అధికారికంగా పం పించి, అక్కడ కొత్త బోర్‌వెల్ తవ్వకాలు, అదనపు భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించా లని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భూగర్భ జలాల ఒత్తిడి అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోనే ఎనిమిది మండలాలు అధిక వినియోగ కేటగిరీలో ఉన్నాయని వెల్లడించారు.

ఇసుక తవ్వకాల అనుమతులకు ముందు భూగర్భ జలాల శాఖతో తప్పనిసరిగా సంప్రదింపులు జరపాల్సిన అవసరంపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,771 పైజోమీటర్లు, 352 పరిశీలనా బావులు, 921 కమాండ్ ఏరియా పరిశీలనా బావు లు, 64 స్ట్రీమ్‌లో చెక్‌పాయింట్ల ద్వారా భూగర్భ జలాల స్థాయిలను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బోర్‌వెల్ కార్యక్రమాల పురోగతిని సమావేశంలో సమీక్షించారు.

సబ్‌ప్లాన్ కింద మంజూరైన బోర్‌వెల్‌లను తవ్వి లబ్ధిదారులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించా రు. ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తు న్న భూగర్భ జలాల సంరక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేసి తెలంగాణకు అనువైన వినూత్న ప్రతి పాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. భూగర్భ జలాల మట్టాన్ని మెరుగుపరచడా నికి భూగర్భ జలాల శాఖ, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పరిశ్రమల శాఖల మధ్య మరింత సమన్వయం అవసరమని స్పష్టం చేశారు.