తులం బంగారం ఏమాయే? బంగారం ఏమో పిరమాయే
షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి బంగారం హామీ గాలికి పెండింగ్లో వేలాది దరఖాస్తులు
నిర్మల్ మే 15 (విజయ క్రాంతి) ఆడబిడ్డల పెళ్లి చేసిన తల్లిదండ్రులకు ప్రభుత్వం ప్రకటించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలో బంగారం హామీ పథకం హామీ అటకెక్కింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన ప్రజాపాలన ప్రభుత్వం రెండున్నర ఏళ్లు గడుస్తున్న పెండ్లి ఇంట బంగారం కానుక రాకుంది. 2023లో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నేతగా ఎన్నికల మేనిఫెస్టోలో ఆడపిల్లల కుటుంబాల్లో పెళ్లి చేసిన కుటుంబ సభ్యులకు ఒక వెయ్యి ఒక వంద పదహారు( రూ.1,00,116 ) తులం బంగారం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించింది.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం గద్దె దించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో ఆరు గ్యారంటీలు అనేక పథకాల హామీలను ఇచ్చింది. ఇందులో ఆడపిల్లలు పెళ్లిళ్లు చేస్తే ప్రభుత్వం అమలు చేస్తున్న షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పథకం రూ 1000 16 నగదుతో పాటు తులం బంగారాన్ని అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ప్రభుత్వం అధికారుల గురించి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు ఈ హామీ అమలు కాకపోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు నిరాశా చెందుతున్నారు.
ప్రభుత్వ హామీ ఏమాయే. బంగారం పిరమా ఏ
రాష్ట్ర ప్రభుత్వం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం కింద ఒక్క లక్ష ఒక వెయ్యి 16 తో పాటు తులం బంగారం హామీ ఇచ్చిన ఎంతవరకు అది ఎక్కడ అమలు కావడం లేదు. నిర్మల్ జిల్లాలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం కింద గత రెండున్నర ఇళ్లలో జిల్లాలో పదివేల వరకు పెళ్లిళ్లు జరిగినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. పెళ్లిళ్లు జరిగిన వెంటనే ఆడపిల్ల తల్లిదండ్రులు షాదీ ముబారక్ కల్యాణ లక్ష్మి పథకం కింద కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు.
పెళ్లి ఫోటో ఇతర సర్టిఫికెట్లకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని సంబంధిత కార్యాలయంలో షాదీము ద్వారా కల్యాణ లక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. గ్రామపంచాయతీ నుండి మొదలుకొని తాసిల్దార్ ఆర్డీవో కార్యాలయం వరకు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అయితే పెళ్లిళ్లు జరిగిన తర్వాత దరఖాస్తు చేసుకుంటే గతంలో మూడు నెలల లోపే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరు అయ్యేవి. ప్రస్తుతం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కు చేతికి రావడానికి ఆరు నెలల నుంచి 8 నెలల వరకు సమయం పడుతున్నట్టు దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక లాగి నుండి మరొక లాగిన్ వరకు మూడు విడతల్లో విచారణ జరిపి అర్హులైన జాబితాను ప్రభుత్వం ప్రకటించి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. గతంలో కొన్నిచోట్ల నకిలీ పెళ్లి ఫోటోలు ఇతర అక్రమాలకు పాల్పడడంతో ప్రభుత్వం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం లో అక్రమాలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపి నిర్ధారణ అయిన తర్వాతనే ప్రభుత్వ పథకానికి అర్హులుగా ప్రకటిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం మంజూరు చేసిన బడ్జెట్ను బట్టి ఆడపిల్లల తల్లిదండ్రుల ఖాతాల్లో 1,00,116 నగదు చెక్కులు అందిస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు మద్దతుతో పాటు తు లం బంగారం (10 గ్రాములు) ఎన్నికల హామీ ఇప్పటికీ ఎక్కడ ప్రారంభం కాలేదు. ప్రతిపక్ష పార్టీలు తులం బంగారంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న అది ఇప్పట్లో అమలు అయ్యే అవకాశం లేకపాయ.
బంగారం ధరలు పిరమాయై
అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ధరలు రోజురోజుకు అమాంతంగా పెరిగి రికార్డ్ స్థాయి చేరుకుంటున్నాయి. తాజాగా బంగారం ధర 10 గ్రాములు మార్కెట్లో రూ.1.65 లక్షలు దాటింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు దీని ధర లక్ష రూపాయల వరకు ఉండేది. దాదాపు 10 గ్రాముల బంగారానికి 65 వేల వరకు ధర పెరిగింది. గత రెండు మూడేళ్లలో బంగారం ధరలు ఈ స్థాయికి పెరగడం బంగారం చరిత్రలోనే మొదటిసారి అని బంగారం వార్తక వ్యాపారులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం పెండ్లిలు పేరంటాలు శుభకార్యాలు ఈ పండుగలు నిర్వహించిన బంగారం వెండి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు సామాన్య మద్దతు ప్రజలకు అందకుండా ఏకంగా. రూ 1.65 లక్షలకు చేరుకోవడంతో కొనడం ఎలా ఉన్నా ధర వెంటనే బెంబేలెత్తిపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎంత అవసరమో అంతే కొనుగోలు చేస్తున్నారు. సామాన్య మద్దతు కుటుంబాల్లో పెళ్లి చేయాలంటే కనీసం మూడు తులాలు బంగారం తప్పనిసరి అవసరం. అది కొనుగోలు చేయాలని కనీసం 5 లక్షల వరకు ఖర్చవుతుంది ఇప్పుడు పెండ్లిలో బంగారం మాట హాట్ టాపిక్ గా మారింది. బంగారం మాట వస్తే చాలు ఆ కుటుంబంలో ఒక గుండె బాధ కలుగుతుంది.
ప్రభుత్వం ఎన్నికల హామీలు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం కింద నగదు తో పాటు తులం బంగారం హామీ ఇచ్చిన ఇంతవరకు ఆది అమలు చేయడం సాధ్యం కాలేదు. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ పథకం అమలవుతుందన్న గ్యారెంటీ కూడా లేదని పలువురు పేర్కొంటున్నారు. షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం కింద నగదు కోసం అప్లికేషన్ పెట్టిన అది కూడా నెలలు తరబడి పెండింగ్ ఉంటుంది.
దీంతో పెళ్లి చేసిన కుటుంబాల్లో తల్లిదండ్రులు ఆ నగదు కోసం వేచి చూస్తున్నారు. పెండ్లి చేసిన కుటుంబాలకు ఆర్థికంగా చేయూత అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తుంటే అది ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు పెరిగిన బంగారు ధరలు ఆ పథకం పై మరింత నీలి నీడలు అమ్ముకునే విధంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నికల ఇచ్చిన హామీలు ఈ పథకం అమలుపై దృష్టి పెట్టి త్వరగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందే విధంగా చూడాలని జిల్లా ప్రజలకు కోరుతున్నారు.






