11 August, 2026 | 2:22 AM

సభకు అమిత్ షా వస్తారు!

11-08-2026 01:06 AM
  1. విద్యార్థులపై బలప్రయోగంపై సమాధానమిస్తారు..
  2. లోక్‌సభ వేదికగా కేంద్ర పార్లమెంటరీ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన
  3. విపక్షాల ఆందోళనతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఆగస్టు ౧౦: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, అక్రమాలను నిరసిస్తూ, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలో గతనెల ౨౦న విద్యార్థులు, కాక్రోచెస్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు శాంతియుతంగా చేపట్టిన ‘చల్ పార్లమెంట్’ ర్యాలీపై పోలీసులు జరిపిన లాఠీచార్జిపై కేంద్ర మంత్రి హోంమత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని విపక్షాలు చేస్తున్న డిమాండ్‌కు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. లాఠీచార్జిపై అమిత్ షా పార్లమెంట్ వేదికగా సమాధానం ఇస్తారని సోమవారం ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు. విపక్ష సభ్యులు అడిగిన ప్రతిప్రశ్నకు అమిత్ షా సమాధానం ఇస్తారని స్పష్టం చేశారు.

హోం మంత్రి సమాధానం ఇచ్చే సమయంలో ప్రతిపక్షాలు ఎలాంటి హంగామా చేయకూడదని విజ్ఞప్తి చేశారు.  పార్లమెంట్ సమావేశాలు మొదలైన నాటి నుంచి అమిత్‌షాను సభకు రప్పించేందుకు విపక్షాలు పట్టుబడుతూ, ఉభయ సభలను స్తంభింపజేస్తున్న విషయం తెలిసిందే. బాష్పవాయు గోళాలు, పెల్లెట్ గన్ల ప్రయోగం, లాఠీచార్జ్ వంటి బలప్రయోగాన్ని తప్పుబడుతున్న విషయమూ విదితమే. అలాగే, బీహార్‌లోని సివాన్‌లో నిరసనకారులపై ఓ కానిస్టేబుల్ ఏకే-47తో కాల్పులు జరపడంపైనా విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి.

ఒక దశలో రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ కూడా విపక్షాల డిమాండ్‌ను అంగీకరించి, కేంద్ర మంత్రి అమిత్ షాను సభకు రప్పించాలని పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి కిరణ్ రిజిజుకు సైతం విజ్ఞప్తి చేశారు. మరోవైపు, వర్షాకాల సమావేశాలు ముగిసేందుకు మరో నాలుగు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో మహిళా కోటా బిల్లు, డీలిమిటేషన్, విదేశీ నిధుల క్రమబద్ధీకరణ సవరణ చట్టం వంటి కీలక బిల్లుల భవితవ్యం అనిశ్చితిలో పడిందని, అందుకే.. కేంద్ర మంత్రి దిగివచ్చారని విపక్షాల సభ్యులు ఎద్దేవా చేశారు.

పార్లమెంట్ వెలుపలా విపక్షాల నిరసన

విద్యార్థులపై లాఠీచార్జిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన చేయాలని, అలాగే, అయోధ్య రామ్ మందిర్ విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణలపై పారదర్శక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ సోమవారం పార్లమెంట్ వెలుపల ఉన్న మకర ద్వారం వద్ద ఇండియా కూటమికి చెందిన ఎంపీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీకి అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.   

ఉభయ సభల్లో 4 బిల్లులు ఆమోదం

విపక్షాల నినాదాల నడుమ ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. రెండు సభల్లోనూ విద్యార్థులపై లాఠీచార్జి, రా మ్‌మందిర్ విరాళాల వ్యవహారంపై చర్చ పెట్టాలని విపక్ష సభ్యులు పట్టుబడుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా  సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.  సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కేంద్ర న్యాయశాఖ మం త్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లును, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి గనులు అభివృద్ధి నియంత్ర ణ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. చివరకు గందరగోళం మధ్యే ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లును సభ ఆమోదించింది. మరోవైపు, రాజ్యసభలో నూ అదే తరహా గందరగోళం నెలకొంది.

అమిత్ షా సభకు వచ్చే వరకు డెడ్‌లాక్: ప్రియాంకా గాంధీ

పార్లమెంట్ వేదికగా కేంద్ర హోమంత్రి అమిత్ షా లాఠీచార్జిపై సమాధానం ఇచ్చేంత వరకు ఉభయ సభలు సజావుగా సాగవని కాంగ్రెస్ ఎంపీ ప్రియాం కా గాంధీ స్పష్టం చేశారు. పార్లమెంట్ భవనం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు. అమిత్ షా సభకు వచ్చి, సమాధానం ఇస్తే కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న స్తంభన (డెడ్‌లాక్) వీడదని తెలిపారు.

విద్యార్థులపై బలప్రయోగానికి బాధ్యులెవరు?: రాహుల్‌గాంధీ

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పార్లమెం ట్‌కు వచ్చి విద్యార్థులపై లాఠీచార్జిపై సమాధానం ఇవ్వాలని తాము 20 రోజులుగా డిమాండ్ చే స్తున్నామని, ఉభయసభల్లో విపక్షాలు ఇదే డిమాండ్‌ను వినిపిస్తున్నాయని, అయినప్పటికీ కేంద్ర మంత్రి సభకు రాలేదని ‘ఎక్స్’ వేదికగా రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ప్రధాని మోదీకి గానీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు గానీ సభకు రావాలనే ఉద్దేశం లేకపోయింద ని విమర్శలు గుప్పించారు. బలప్రయోగంపై చర్చించేందుకు ప్రతిపక్షం ప్రవేశపెట్టిన ప్రతి తీర్మానం సైతం తిరస్కరణ కు గురైందని గుర్తుచేశారు. లాఠీచార్జికి పాల్పడిన పాలకులు దోషులైనా అయిండాలి.. లేదా అసమర్థులైనా అయి ఉండాలంటూ మండిపడ్డారు. 

అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్తారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చేసిన ప్రకటనపైనా రాహల్‌స్పందించారు. అమిత్ షా సభకు వచ్చేందుకు ముందు విద్యార్థులపై ఎవరు కాల్పులు, పెల్లెట్ తుపాకుల ప్రయోగానికి పాల్పడ్డారో, అందుకు ఎవరు అనుమతి ఇచ్చారన్న .. విషయం తేల్చిచెప్పాలన్నారు. ఒకవేళ లాఠీచా ర్జి, బలప్రయోగానికి అమిత్ షా అనుమతి ఇచ్చి ఉంటే, ఆయన నేరస్థుడని పేర్కొన్నారు.