11 August, 2026 | 2:22 AM

మద్యం మత్తులో కారు డ్రైవింగ్.. రోడ్డు ప్రమాదంలో ఆర్మీ రిటైర్డ్ జవాన్ మృతి

11-08-2026 01:06 AM

రాజేంద్రనగర్, ఆగస్టు 10 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెలవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి చెందాడు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్ షాకోట్ ఎస్ ఎంపి స్కూల్ సమీపంలో రోడ్డుపై వెళ్తున్న జవాన్ ను అతివేగంగా వచ్చిన మహేంద్ర ఎస్ యు వి 350 కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో రాపిడో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీకొనడంతో గాయపడ్డారు.

వారిలో ఒకరికి కాలు విరిగినట్లు సమాచా రం. క్షతగాత్రులను ప్రవేట్ హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదం అనంతరం కారులో ఉ న్న నలుగురు  యువకులు వాహనాన్ని అక్క డే వదిలి పరారైనట్లు పోలీసు తెలిపారు. కారు నెంబర్ ఆధారంగా వాహనం శంషాబా ద్ కు చెందినదిగా గుర్తించారు. ఘటనపై నర్సింగ్ పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.