రోడ్డు పక్కనే నీటిగుంత.. ప్రజలకు తప్పని తిప్పలు
30-05-2026 12:18 PM
బోథ్,మే30(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రధాన రహదారి నిర్మల్ ఆదిలాబాద్ రోడ్డు పక్కనే నీటి గుంతలు ఉండడంతో ప్రజలు పదాచారులు తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నారు. నూతనంగా నిర్మించిన భవనాలకు మురుగునీటి పారుదల సౌకర్యం లేకపోవడంతో ఇండ్లలో వినియోగించిన మురికి నీరంతా రోడ్డుపైకి వస్తున్నది. రోడ్డు పక్కనే మురికి నీటి గుంత ఏర్పడడంతో అందులో పశువులు తిష్ట వేస్తున్నాయి. మురికి నీరు గుంతలో నిండిన అనంతరం రోడ్డుపైకి ప్రవహిస్తుండడంతో నడిచి వెళ్లేవారు వాహనాల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు మురికి నీరు రోడ్లపైకి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాల్సిన అవసరం ఉంది






