12 March, 2026 | 9:22 AM

గ్లోబల్ మార్కెట్లకు యుద్ధం శాపం

11-03-2026 12:00 AM

లక్కాకుల కృష్ణమోహన్ :

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యు ద్ధం గ్లోబల్ మార్కెట్లకు శాపంగా పరిణమించింది. ముఖ్యంగా భారత్‌కు చమురు దిగుమతి చిక్కులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఏడీబీ, మూడీస్ అనే రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేశాయి.  తాజాగా దేశీయంగా ఎల్పీజీ, గ్యాస్ సిలిండర్ ధరలు పెరి గాయి. దేశీయ ఇంధన అవసరాలకు భారత్ ఎక్కువశాతం దిగుమతులపైనే ఆధారపడాల్సి వుంది. మరోవైపు డాలర్ మారకంతో రూపాయి బలహీనపడటంతో భారత్‌కు ఇబ్బందులు తప్సేట్లులేవు.

అమెరికా, రష్యా నుంచి ఒక నెల రోజుల పాటు ముడి చము రు దిగుమతికి అనుమతించడం కాస్తా ఊర ట కలిగించే అంశమే. అయితే.. భారత్ విషయానికి వస్తే దేశీయ అవసరాలకు దిగు మతులపై ఆధారపడుతున్నందు వల్ల దేశం లో పెట్రోలియం ఉత్పత్తులు ధరలు పెరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉందని ‘మూ డీస్’ వెల్లడించింది. కాగా, దేశీయ అవసరాలకు రష్యా నుంచి ముడి చమురు అదీ తక్కువ ధరకు దిగుమతి చేసుకునేది.. అయి తే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌ను బెదిరించి.. రష్యా నుంచి కొనుగోలు చేయరాదని ఆదేశాలు జారీ చేశారు.

దీనికి ఆయ న చెబుతున్న కారణం రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందు వల్లే రష్యా ఆ డబ్బుతో ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోంద ని. ఉక్రెయిన్‌కు చెందిన అమాయకులను మహిళలు, పిల్లలను రష్యా చంపుతున్నదని ట్రంప్ ఆంక్షలు విధించారు. రష్యా నుంచి ముడి చమురు దగుమతి చేసుకుంటే, జరిమానాతో కలిసి 50 శాతం సుంకం విధిస్తానని హెచ్చరించడమే కాకుండా అమలు చే యడమూ జరిగిపోయింది.

ఎన్నో ఉత్పత్తి రంగాలు కుదేలు

భారత్‌పై 50 శాతం సుంకం విధించడం వల్ల ఇండియాకు చెందిన వాణిజ్య రంగాలు కుదేలయ్యాయి. వాటిలో వస్త్ర, ఆక్వా, ఆభరణాల రంగాలు మూతపడ్డాయి. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన టెక్ట్స్‌టైల్స్ రంగం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ రంగంపై లక్షలాది మంది కార్మి కులు బతుకుతున్నారు. జెమ్స్ అండ్ జ్యూవెలరీ విషయానికి వస్తే, గుజరాత్‌లో ఈ రంగంపై ఆధారపడి లక్షలాది మంది కార్మికులు జీవిస్తున్నారు.

ఆక్వా రంగం విషయా నికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ రైతులు అమెరికా ఆంక్షల వల్ల తీవ్రంగా నష్టపోయారు. అయి తే, భారత విదేశాంగమంత్రి జైశంకర్ ఇటీవల అమెరికా విదేశాంగమంత్రి, వాణిజ్య మంత్రితో చర్చలు జరిపి ఒక ఒప్పందానికి వచ్చారు. భారత్ క్రమంగా రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు తగ్గిస్తామని అమెరికాకు హామీ ఇచ్చింది.

భారత్ అందుకే.. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి తగ్గించింది. బదులుగా భారత్‌పై విధించిన సుంకాలను అమెరికా 50 నుంచి 18 శాతానికి తగ్గించింది. అయితే, గత నెల 28న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను రష్యా ముడి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతించారు. అదీ కూడా ఒక నెల రోజులపాటు మాత్రమే..

పెరిగిన సిలిండర్ ధరలు

చమురు అవసరాలకు భారత్ 90 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నది. అయితే ఈ 90 శాతం ముడిచమురులో సగానికి పైగా స్ట్రయిట్ ఆఫ్ హోర్మూజ్ --- లేదా హో ర్మూజ్ జలసంధి నుంచి దిగుమతి చేసుకుంటున్నది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయె ల్‌పై ఇరాన్ దాడులు చేసిన వెంటనే ఇరాన్ హోర్మూజ్ జలసంధిని మూసేసింది. ఇక్కడి నుంచి ఆయిల్ టాంకర్లను రవాణా కానివ్వమని ఇరాన్ హెచ్చరించింది.

ఒక వేళ ఇక్కడి నుంచి ఆయిల్ టాంకర్లు వెళితే పేల్చేస్తామి హెచ్చరించడంతో హోర్మూజ్ జలసంది వద్ద వందలా ఆయిల్ టాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక ఇండియాకు ముడి చము రు సరఫరా తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇండియన్ ఆయిల్ కం పెనీలు అప్పుడే ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ రూ.60 పెంచేశాయి. వాణిజ్యానికి సం బంధించిన సిలిండర్ అయితే రూ.115 పెం చాయి. సవరించిన ధరలు మార్చి 7 నుంచి అమలులోకి వచ్చాయి. 

భారత ప్రతిష్ఠకు దెబ్బ

భారత్‌కు అమెరికా కేవలం 30 రోజులు మాత్రమే గడువు ఇచ్చి రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడానికి అనుమతించడం భారత ప్రతిష్ఠకు కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇండియా సార్వభౌమత్వానికి కూడా ఇబ్బందికరమైన పరిణామ మే. అదీ కాకుండా .. దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడుతున్నది.. ఇప్పటికే డాలర్ మారకంతో రూపాయి బలహీనపడింది.

ఒక్క డాలర్ 92 రూపాయలు పలు కుతున్నది. అదే సమయంలో భారత్ వాణిజ్యలోటు కూడా క్రమంగా మరింత పెరుగుతున్నది. నీతీ ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పినట్లు బ్యారల్ ధర 10 డాలర్లు పెరిగితే ఇండియా వార్షిక దిగుమతి బిల్లుపై అదనంగా 14 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి వస్తుందన్నారు. అంటే.. అదనంగా లక్షా 30వేల కోట్లు చెల్లించుకోవాల్సి వస్తుందని.. మొత్తం ఇండియా వార్షిక బిల్లు ఏకంగా 180 బిలియన్ డాలర్లకు చేరుతుందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పుకొచ్చారు.

ఇక బ్లూమ్బర్గ్  తాజాగా ఒక నివేది కలో వైట్ హౌస్ మాజీ అధికారి ప్రస్తుతం రాపిడాన్ ఎనర్జీ గ్రూపు ప్రెసిడెంట్ బాబ్ మెక్ నెల్లీ రాబోయే రోజుల్లో లేదా వారాల్లో బ్యారల్ ముడి చమురు వందడాలర్లకు చేరుతుందని చెప్పారని బ్లూమ్‌బర్గ్ ఒక నివేదికలో పేర్కొంది. హోర్మూజ్ జలసంధి తెరి చే వరకు ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు లేదా ఏబీడీ భారత్ వద్ద కేవలం 100 మిలియన్ బ్యారెళ్ల ముడిచమరు నిల్వలు మాత్రమే ఉన్నాయని తెలిపిం ది.

ఇది కేవలం 40 నుంచి 45 రోజుల అసరాలకు మాత్రమే సరిపోతాయని, ఒక వేళ హో ర్మూజ్ జలసంధి దీర్ఘకాలంగా పాటు మూ సేస్తే తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించింది. జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా వద్ద 90 రోజులకు సరిపడా స్టాక్ ఉంది. చైనా విషయానికి వస్తే 401 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు నిల్వలు న్నాయి.

దీని ద్వారా మూడు నుంచి నాలు గు నెలల వరకు ముడి చమును నిల్వలను సునాయసంగా వాడుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక మన ఇండియా విషయానికి వస్తే కేవలం 40 నుంచి 45 రోజు లకు సరిపడే ముడి చమురు నిల్వలు మా త్రమే ఉన్నాయని ఏడీబీ చీఫ్ ఎకనమిస్టు ఒకరు చెప్తున్నారు.

మున్ముందు తీవ్రమైన ఇబ్బందులు

రాబోయే రోజుల్లో ఆసియా దేశాల్లో ఇం డియా తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. ఒక వైపు ఇంధన ధరలు పెరిగితే సబ్సిడీ బిల్లు పెరిగిపోతున్నది.. అలాగే దేశంలో ద్ర వ్యోల్బణం పెరుగుతున్నది. అలాగే కరెన్సీ మారకం రేటు డాలర్ మారకంతో రూపా యి మరింత బలహీనపడుతుంది. దీంతో దిగుమతులు ఖరీదైన వ్యవహారంగా మారతాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు బలహీన పడతాయి.

దేశంలో పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీలు తమ డబ్బును ఇండియన్ మార్కెట్ నుంచి ఉపసంహరిస్తాయి. రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అనే సంస్థ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం భారత్ తీవ్ర ప్రభా వం చూపుతుందని హెచ్చరించింది. రూ పాయి బలహీనపడితే.. ద్రవ్యోల్బణం పెరగుతుందని.. కరెంటు ఖాతాలోటు పెరుగుతుం దని హెచ్చరించింది.

గుజరాత్‌లోని కీలక పరిశ్రమలకు గ్యాస్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్డర్లు ఆలస్యమవుతాయని వివరించింది. చమురు ధరలు పెరిగితే, ఇండియా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదంటున్నారు ఆర్థికవేత్తలు.  

వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్

సెల్: 97054 72099