ఓటు ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్‌పల్లి, ఆగస్టు 28 (విజయక్రాంతి): ఓటు ప్రతీ పౌరుని ప్రాధమిక హక్కు అని ఎ స్‌ఐర్‌లో ఓట్లు గల్లంతు కాకుండా చూడాల ని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు కూకట్ ప ల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు.కూకట్ పల్లి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులతో , శుక్రవారం తన క్యాంప్ కార్యాలయం లో జ రిగిన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఎస్ ఐ ఆర్ పై ప్రజలకున్న సందేహాలను నివృత్తి చేస్తూ ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ద్వారా ఓట్లు గ ల్లంతయిన ప్రతీ ఒక్కరి ఓటు తిరిగి చెర్చేలా చూడాలని డివిజన్ నాయకులకు అయన ఆదేశించారు.కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలలోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు.
22ఏ లో ఎవరివైన ఆస్తులు చేర్చిన యెడల వారికి ధైర్యం చెప్పి రెవిన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకునే విదంగా సూచనలు చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్లు మందా డి శ్రీనివాస రావు, గౌసోద్దీన్, శిరీష బాబురావు, సతీష్ గౌడ్, ముద్దం నరసింహ యాదవ్, శ్రావణ్ కుమార్, సత్యనారాయణ, రంగారావు, బిఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గన్నారు.






