వంద బస్తాల ధాన్యం అగ్నికి ఆహుతి
- వరి కొయ్యలకు నిప్పుతో అంటుకున్న మంటలు
- మెదక్ మండలం పేరూరులో ఘటన
మెదక్, మే 18 (విజయక్రాంతి): గుర్తు తె లియని వ్యక్తులు వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో.. మంటలు పక్కనే ఉన్న కొనుగోలు కేంద్రానికి వ్యాపించాయి. అక్కడ ఇద్దరు రైతులకు చెందిన వంద బస్తాల ధాన్యం దగ్ధమైంది. మెదక్ జిల్లా పేరూర్ గ్రామంలోని ఐకెపి కొనుగోలు కేంద్రం సమీపంలోని పొ లంలో వరి కొయ్యలకు దుండగులు నిప్పు పెట్టారు. అవి కొనుగోలు కేంద్రానికి వ్యాపించడంతో తూకం వేసి పెట్టిన ఇద్దరు రైతులు సిద్ధిరాములు, పోచయ్యలకు చెందిన సుమా రు 100 బస్తాల (40క్వింటాళ్లు) ధాన్యం కాలిపోయాయి.
అగ్నిమాపక సిబ్బంది సమయానికి ఫైర్ ఇంజన్‌తో వెళ్లి మంటలను అ దుపులోకి తీసుకురావడంతో పెను ప్రమా దం తప్పింది. లేకపోతే భారీ నష్టమే వాటిల్లేదని రైతులు తెలిపారు. అగ్ని ప్రమాద ఘట నపై మెదక్ ఆర్డిఓ రమాదేవి, మెదక్ తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, సర్పంచ్ జి.కమలమ్మ సంఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామ నిర్వహించారు. బాధిత రైతులకు ప్రభుత్వ పరంగా నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.






