వీఓఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
సర్పంచుల సంఘం అధ్యక్షుడు మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి
కడ్తాల్, మే 27 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో వీఓఏల (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు) దీర్ఘకాలిక సమస్యలను ప్రభు త్వం వెంటనే పరిష్కరించాలని సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహారెడ్డి డిమాండ్ చేశారు. కడ్తాల్ మండల కేంద్రంలో వీఓఏలు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి బుధవారం ఆయన హాజరై పూర్తి మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ మహిళా సంఘాల బలోపేతానికి నిరంతరం శ్రమిస్తున్న వీఓఏల వేతనాన్ని రూ. 20 వేలకు పెంచాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అలాగే జీవో నెం. 58కి సవరణలు చేయాలని, గ్రేడింగ్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వీఓఏల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు కవిత, ప్రధా న కార్యదర్శి ప్రమీల, జ్యోతి, వీఓఏలు చంద్రశేఖర్, వినోద్, లావణ్య, వనిత, శైలజ మరి యు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.






