28 May, 2026 | 3:41 AM

సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్

28-05-2026 12:00 AM

ప్రతి దరఖాస్తుకు ప్రాధాన్యత ః సీతక్క 

మహబూబాబాద్, మే 27 (విజయక్రాంతి): క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల స్వయం ఆర్థిక అభివృద్ధి కోసం వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయడం జరుగుతుందని,అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్, ఇందిర మ్మ ఇండ్లు, అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

బుధవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ డాక్టర్ శబరిష్, డీఎఫ్‌ఓ విశాల్ బత్తుల, ఆర్డి ఓ క్రిష్ణవేణి, జడ్పీ సీఈవో పురుషోత్తం, జిల్లాస్థాయి ఉన్నతాధికారులందరితో కలిసి మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడ ఏజెన్సీ ఓటా యి, కొత్తగూడ మండల కేంద్రంలో మంత్రి సీతక్క ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామపంచాయతీ సర్పంచులు, సూచించిన సమస్యల పరిష్కారం నిమిత్తం వెంటనే కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు ఆదేశాలు, సూచన లు జారీ చేశారు. ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత విభాగానికి పంపి అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి వారు చేసుకున్న సంక్షేమ ఫలాల పథకాల ద్వారా లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం సుమారు 60 వేల 400 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందించడం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులు మహిళా సంఘాలలో సభ్యులుగా ఉంటే ఆర్థిక భరోసా కింద లక్ష రూపాయలు అందించడం జరుగుతుందన్నారు.

పేదవాడి సొంత ఇంటి నిర్మాణ కలను సహకారం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగానే జిల్లాకు వచ్చిన కోటాకు అదనంగా మరో రెండు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం కోసం  చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ఇండ్లు నిర్మించుకోలేని పరిస్థితిలో ఉన్న వారి సౌకర్యార్థం ఒక సంస్థ ద్వారా ఇండ్లు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

గ్రామీణ ప్రాం తాలలో కరెంటు సమస్యలను తీర్చడం కో సం ఉపముఖ్యమంత్రి గారి చేత ప్రత్యేకంగా కరెంటు స్తంభాల మంజూరు నిధుల మం జూరు చేయించడం జరిగిందని, ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన కరెంటును అందించాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా ప్రజల సమస్యలను ఓపికగా వింటూ దరఖాస్తులను స్వీకరించారు. అర్జీదారులతో మాట్లాడి సమస్యల తీవ్రతను అడిగి తెలుసుకున్నారు.

ప్రజా దర్బార్లో ప్రధానంగా ఇండ్ల స్థలాలు, ఆసరా పెన్షన్లు, భూమి సమస్యలు, రేషన్ కార్డులు, గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, ఆరోగ్య సహాయం వంటి పలు అంశాలపై ప్రజలు మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి, డిఆర్‌డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు, అన్ని విభాగాల జిల్లా అధికారులు, తహసిల్దార్ రాజు, ఎంపీడీవో మున వర్ బేగ్, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.