జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పై రైతులకు వీడియో కాన్ఫరెన్స్
17-03-2026 05:09 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద రైతు వేదికలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పై రైతులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగిందని మండల వ్యవసాయ శాఖ అధికారి సాయికిరణ్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... ప్రతి రైతు తన ఇంటి అవసరాల కోసం అయినా కచ్చితంగా సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహార ధాన్యాలను కూరగాయలను వాడాలని రైతులకు సూచించారు.ఈ జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కింద రైతులకు కిట్లు అందజేయడం జరిగింది.ఈ కోట్లలో క్యాలెండర్ పెన్, టోపీ,జ్యూట్ బ్యాగు సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన సమాచారంతో కూడిన నోట్ బుక్కు రైతులకు అందించడం జరిగిందని మండల వ్యవసాయ శాఖ అధికారి సాయికిరణ్ తెలిపారు.




