calender_icon.png 24 February, 2026 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు రక్షణ కల్పించాలి

24-02-2026 12:57:50 AM

  1. టీఆర్పీ నాయకుల డిమాండ్

పలు జిల్లాల్లో కొవ్వొత్తుల ర్యాలీ

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో బీసీలపై అగ్రకుల వ్యక్తుల దాడిలో పసికందు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమ ని టీఆర్పీ నాయకులు అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని, ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దాడిని ఖండిస్తూ సోమవారం రాత్రి పలు ప్రాంతా ల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, చిన్నారి మృతికి నివాళులర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్పీ క్రమశిక్షణ కమిటీ బందరు నరసయ్య గౌడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మల్లెల వీరయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొర్రా ప్రశాంత్ గౌడ్, అశ్వారావుపేట మండల అధ్యక్షులు పంబి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో అశ్వారావుపేటలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజిని కుమార్ యాదవ్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు బత్తిని వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రజినీకాంత్, రజక సంఘం నాయకుడు చిట్టాల బిక్షపతి, బాలినే లక్ష్మి, పూజారి సత్యనారాయణ, ముడిదే శ్రీనివాస్, మల్లిఖార్జున శాస్త్రి, మార్త శ్రీనివాస్, పోలు రాజు, భద్రకాళి రమణ, రుద్రమని శ్రీనివాస్, శ్రీధర్, అన్వేష్, రమణ పటేల్ పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.