2 July, 2026 | 1:18 AM

ఉపాధి హామీని కాపాడాలి

02-07-2026 12:14 AM

విజిబి రామ్‌జి పథకాన్ని రద్దు చేయాలి

వీపనగండ్ల జులై 1: గ్రామీణ పేదల జీవనాధారమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి బాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

మండల కేంద్రంతో పాటు పలు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉపాధి కూలీలతో కలిసి ధర్నా నిర్వహించి ఏడాదికి 200 రోజులు ఉపాధి కల్పించడం పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించడం కూలీల హక్కులను పరిరక్షించడం వంటి డిమాండ్లతో వినతి పత్రాలు ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులకు సర్పంచ్లకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా ప్రజాసంఘాల నాయకులు ఖాజా హుస్సేన్ ఈశ్వర్ రాములు శాంతమ్మ ముత్యాలు రాముడు నిరంజన్ చంద్రయ్య కృష్ణయ్య వెంకటేష్ గౌడ్ రామకృష్ణ వెంకన్న నవీన్ దేవేంద్ర చారి ఉపాధి కూలీలు రైతులు తదితరులు పాల్గొన్నారు.