1 July, 2026 | 9:01 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది

01-07-2026 07:57 PM

ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమం చేరేలా కృషి: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల: మున్సిపాలిటీలోని అంబేడ్కర్ కళాభవన్‌లో నేడు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా అందేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.